Monday, June 28

గోవింద నామాలు


శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా
భక్త వత్సల గోవిందా భాగవతప్రియ గోవిందా
నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుష గోవిందా పుండరికాక్షా గోవిందా
నంద నందనా గోవిందా
నవనీతచోర గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
పశుగణపాలక గోవిందా పాపవిమోచన గోవిందా
దుష్ట
సంహార గోవిందా దురిత నివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా
వజ్ర
మకుటధరా గోవిందా వరాహమూర్తి గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
గోపిజనలోల గోవిందా గోవర్ధనోదార గోవిందా
దశరధ నందన గోవిందా దశముఖ మర్దన గోవిందా
పక్షివాహనా గోవిందా పాండవప్రియ గోవిందా
మత్య్స కూర్మా గోవిందా మధుసూదన హరి గోవిందా
వరహా మూర్తి గోవిందా
వామన భృగురామ గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
బలరామానుజ గోవిందా భౌదకల్కిధర గోవిందా
వేణుగాన
ప్రియా గోవిందా వేంకటరమణా గోవిందా
సీతా నాయక గోవిందా శ్రితజనపాలక గోవిందా
దారిద్ర
జనపోషక గోవిందా ధర్మసంస్తాపన గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
అనాధ రక్షక గోవిందా ఆపద్భాందవ గోవిందా
శరణాగత వత్సల గోవిందా కరుణాసాగర గోవిందా
కమలదళాక్షా గోవిందా కామితఫలదా గోవిందా
పాపనాసనా గోవిందా పాహిమురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
ధరణీనాయక గోవిందా దినకర తేజ గోవిందా
పద్మావతీ
ప్రియ గోవిందా ప్రసన్నమూర్తి గోవిందా
అభయహస్త ప్రదర్సన గోవిందా మత్సావతార గోవిందా
శంఖచక్రధర గోవిందా శార్ ఙ గదాధర గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
విరజాతీర్దా గోవిందా విరోదిమర్ధన గోవిందా
సాలగ్రామరూప గోవిందా సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తురితిలకా గోవిందా కాంచనాంభరధర గోవిందా
గరుడవాహనా గోవిందా
గజరాజ రక్షక గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
వానర సేవిత గోవిందా వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ
గోవిందా ఏకస్వరూప గోవిందా
శ్రీరామకృష్ణ గోవిందా రఘుకల నందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాలు గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
వజ్రకవచధారా గోవిందా వైజయంతిమాల గోవిందా
వడ్డికాసుల వాడ గోవిందా వసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చితా గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీపుంరూపా గోవిందా శివకేశవ మూర్తి గోవిందా
బ్రహ్మాండ రూపా గోవిందా
భక్త రక్షకా గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
నిత్యకల్యాణ గోవిందా నీరజనాభా గోవిందా
హాధీరామప్రియ
గోవిందా హరిసర్వోతమ గోవిందా
జనార్ధన
మూర్తి గోవిందా జగత్సాక్షిరూప గోవిందా
అభిషేకప్రియా గోవిందా ఆపన్నివారణ గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
రత్నకిరీటా గోవిందా రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశీ గోవిందా ఆశ్రిత పక్షా గోవిందా
నిత్యరక్షకా గోవిందా నిఖిలలోకేశా గోవిందా
ఆనందరూప గోవిందా ఆద్యంతరహితా గోవిందా
ఇహపరదాయక గోవిందా
ఇభరాజరక్షకా గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
పరమదయాళు గోవిందా పద్మనాభాహరి గోవిందా
తిరుమలవాసా గోవిందా తులసీ వనమాల గోవిందా
శ్రీశేషశయన గోవిందా శేషాద్రి నిలయా గోవిందా
శ్రీ
శ్రీనివాస గోవిందా శ్రీవేంకటే గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా

ఏడుకొండలవాడ వేంకట రమణా గోవిందా గోవిందా




Tuesday, June 8

పురాణములు

జాతి యొక్క ప్రాచీన చరిత్ర, సంస్కృతి, సభ్యత, భాగావాదాచార వివరాలను, దైవస్తుతి ని తెలియచేసేవి పురాణాలు. వేదవ్యాస మహర్షి వేదాల లక్షసిద్ధిని సరళంగా పురాణాల ద్వారా అందిచారు. మొత్తం 18 పురాణాలు ఉండగా, మరో36 ఉప పురాణాలు అదనంగా ఉన్నాయి. శతకోటి శ్లోకాలతో ఇమిడియున్న పురాణాలను వ్యాస మహర్షి నాలుగు లక్షలకు కుదించి, వాటిని 18 పురాణాలలో రూపొందించారని చెప్తారు.
వీటిలో కొన్ని వేదాలకు సమకాలీకం అని, మరికొన్ని వేదాలకు ముందని చెప్తుంటారు.

బ్రహ్మ పురాణం :
ప్రాచీన మొదటి మహా పురాణం. సృష్టి కర్తను స్తుతించిన పురాణం.

పద్మపురాణం :
ఖండాలుగా గల పురాణంలోనూ బ్రహ్మదేవుని స్తుతిస్తూ చెప్పబడినది.

విష్ణు పురాణం:
పురాణంలో విష్ణు భక్తీ ని గురించి ప్రదానంగా భోదించారు.

వాయుపురాణం:
దీనిని శివపురాణం అని కూడా అంటాము. శైవులకు ఆరాధ్య పురాణం.

మార్కండేయ పురాణం:
మార్కండేయ చరిత్ర తో పాటు వేల శ్లోకాలు కల్గిన పెద్ద గ్రంధము.

లింగపురాణం :
లింగ పూజలలోని శక్తిని, పూజ విధానాన్ని విపులంగా వర్ణించబడినది.

స్కంద పురాణం :
పార్వతి పరమేశ్వరుల పుత్రుడైన స్కందుడిచే చెప్పబడిన పురాణం. శివపార్వతుల లీలలు పురాణం లో చెప్పబడ్డాయి.

నారద పురాణం:
నారద మహర్షి చేత చెప్పబడిన పురాణం అనితరమైన విష్ణు భక్తిని ప్రభోదిస్తుంది. వైష్ణవ భక్తులకు అతి ముఖ్యమైనది.

శ్రీ మద్భాగవత పురాణం:
భక్తి తత్వానికి సంబంధించిన పురాణంలో సృష్టి ఆరంభ వర్ణనలు ఉన్నాయి.

బ్రహ్మ వైవక్త పురాణం:
కృష్ణ భక్తిని ప్రభోదిస్తుంది. రాధాకృష్ణుల భక్తి తత్వాన్ని తెలియచేస్తుంది.

మత్స్యపురాణం:
అవతారగాధాలకు సంబంధించిన పురాణం. దాన ధర్మాలు, జపతపాల ప్రాశాస్త్రాన్ని వివరించబడినది.

కూర్మ పురాణం:
విష్ణుమూర్తి అవతారములను తెలియచేసే పురాణం. శివకేశవుల ఏకత్వాన్ని తెలుపుతుంది.

వరాహపురాణం:
విష్ణు వరాహ అవతారం గురించి వివరించబడినది.

వామనపురాణం :
వామనావతార కథే పురాణం.

అగ్ని పురాణం:
భగవంతుని అవతారాలు, దేవాలయ నిర్మాణ శాస్త్రం, విగ్రహ శాస్త్రాలను చెప్పే పురాణం.

భవిష్య పురాణం:
భవిష్యత్ గురించి చెప్పే పురాణం.

బ్రహ్మాండ పురాణం:
విశ్వాన్ని వివరించి వివరంగా చెప్పడం తో పాటు భూగోళ, భూగర్భ, ఖగోళ శాస్త్రాలను వివరించారు.

గరుడ పురాణం:
విద్యనూ గురించి, శాస్త్రాల గురించి, గీతా సారం గురించి చెప్పబడినది.